IHG

కరోనా వైరస్ వుహాన్ నగరం జంతు మార్కెట్ నుండి పుట్టింది కాదని శాస్త్రవేత్తలు తేల్చి చెప్పేశారు. ఇది కేవలం మనిషినుండి మాత్రమే జంతువులకు సంక్రమించింది అని రూఢిగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు. అలీనా చాన్ అనే మాలిక్యులర్ బయాలజిస్ట్ కరోనాగురించి నమ్మలేని నిజాలను బయటపెట్టారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ..వుహాన్ జంతు మార్కెట్ లోని జంతువుల ద్వారా ఆ వ్యాధి మనుషులకు సోకిందన్న మాటను ఆయన తోసిపుచ్చారు..దీనికి సంబంధించి ఎటువంటి డేటా తమకి దొరకలేదని అయన తెలియజేశారు. ఈ అసందర్భగా అసలు ఈ వైరస్ సోర్స్ (మూలం) ఎక్కడి నుంచి పుట్టిందో ఎస్టాబ్లిష్ చేసేందుకు ప్రపంచ దేశాలు చేస్తున్న యత్నాలను చైనా నీరుగారుస్తున్న నేపథ్యంలో ఈ కొత్త స్టడీ మరిన్ని విశేషాలకు కేంద్ర బిందువవు అయ్యింది.

 

IHG

వుహాన్ నగర ల్యాబ్ నుండి ఈ వైరస్ బయటికి వచ్చిందన్న వాదనను చైనా బలవంతంగా నీరుకారుస్తోంది. అయితే జంతు కణజాలాలనుండి ఈ వైరస్ వ్యాపించిందన్న ఉద్దేశంతో విస్తృతంగా తాము పరిశోధనలను జరుపగా అందుకు ఎటువంటి ఆధారాలు దొరకలేదని అలీనా చాన్ అనే మాలిక్యులర్ బయాలజిస్ట్ ఈ సందర్భగా తెలియజేశారు. అయితే ల్యాబ్ వాతావరణంలో పరిశోధనలు జరుపుతుండగా ఆ వైరస్ నుసంక్రమించడానికి అనువైన పధ్ధతిని ఎడాప్ట్ చేసుకున్నట్టు కనిపిస్తోందని ఆయన చెప్పారు . అంటే అదివరకే ఒక వ్యక్తికి ఈ వైరస్ సోకి ఉండవచ్ఛు అన్న అనుమానాలను ఆయన వ్యక్తం చేశారు. అసలు ఈ ఔట్ బ్రేక్ పై అంతర్జాతీయ దర్యాప్తు జరగాలన్న డిమాండు పెరుగుతున్న నేపథ్యంలో.. తాము ఇంకా లోతుగా ఈ వైరస్ కి సంబంధించిన అంశాలను పరిశోధించాల్సిన అవసరం ఉందని అలీనా చాన్ పేర్కొన్నారు.

IHG's 'wet markets' reopen, face heat - The Hindu

 

మరింత సమాచారం తెలుసుకోండి: