నాలుగో ద‌శ  లాక్‌డౌన్ పొడిగింపు‌ నేపథ్యంలో ఈ నెల 31వ తేదీ వరకు మెట్రో రైల్‌ సేవలు నిలిపివేశారు. దేశంలోని మెట్రో సర్వీసులన్నింటినీ అప్పటి వరకు తెరవొద్దని కేంద్రం ప్రకటించడంతో హైదరాబాద్‌ మెట్రో సేవలు నిలిచిపోనున్నాయి. ప్రజా రవాణాతో కరోనా మరింత విస్తరించే అవకాశం ఉన్నందున మెట్రోరైలు  ఆపరేషన్స్‌ను నిలిపివేశారు. అదేవిధంగా ఆర్టీసీ అంతరాష్ట్ర సర్వీసులను ఆయా రాష్ర్టాల మధ్య పరస్పర అవగాహనతో  నిర్ణయం తీసుకునే అవకాశం ఇచ్చారు. సిటీ బస్సులకు సంబంధించి రాష్ర్టాలే నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొన్నారు. బస్‌డిపోలు, రైల్వే స్టేషన్లలో క్యాంటిన్లు తెరువొద్దని సూచించారు.

 

మెట్రోరైలు నడుపకున్నా  హైదరాబాద్‌లో మెట్రోస్టేష న్లు, కారిడార్‌ ప్రాంతాలను మెట్రో సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. కేంద్రం నుంచి ఎప్పుడు ఆదేశాలు వచ్చినా రైళ్లు నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు మెట్రోరైలు అధికారులు చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: