ప్రపంచదేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. కరోనా విజృంభిస్తూ ఉండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ నేటి నుంచి జెనీవాలో అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించనుంది. అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌లాంటి దేశాలు ఈ సమావేశాలను ఒక అవకాశంగా వినియోగించుకోవాలని చూస్తున్నాయి. తనపై వచ్చిన ఆరోపణలకు డబ్ల్యూహెచ్‌వో వేదికగా సమాధానం ఇచ్చేందుకు చైనా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు ఐరోపా సంఘం, ఆస్ట్రేలియా నేతృత్వంలోని 62 దేశాల కూటమి కరోనా మహమ్మారి విజృంభణపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని తీసుకొస్తున్న ప్రతిపాదనను భారత్ సమర్థించింది. చైనాను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రతిపాదన సిద్ధమవుతోంది. అయితే అందులో చైనా పేరును మాత్రం ప్రస్తావించలేదని సమాచారం. 2019 డిసెంబర్ లో చైనాలో పుట్టిన కరోనా వైరస్ పై భారత్ తన వైఖరిని వెల్లడించడం తొలిసారి. 

మరింత సమాచారం తెలుసుకోండి: