కేంద్ర ప్రభుత్వం నిన్న నాలుగో విడత లాక్ డౌన్ మార్గదర్శకాలను విడుదల చేసింది. కేంద్రం మార్గదర్శకాలను అనుసరించి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు భారీగా సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్రం నాలుగో విడత లాక్ డౌన్ లో రాష్ట్రాలకు పూర్తి అధికారాలు ఇచ్చింది. సంబంధిత రాష్ట్రాల మధ్య పరస్పర అంగీకారంతో ప్రయాణికుల వాహనాలు, బస్సుల అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతులు ఇచ్చింది. 
 
కంటైన్మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో సెలూన్లు, స్పాలతో పాటు అన్ని రకాల షాపులకు అనుమతులు ఇచ్చింది. ఈ కామర్స్ సంస్థలు అత్యవసర వస్తువులతో పాటు అన్ని రకాల వస్తువులను సరఫరా చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రెస్టారెంట్లలో హోం డెలివరీకి అనుమతి ఇచ్చింది. ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కానుండగా.. సీఎం జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈరోజు జగన్, కేసీఆర్ లాక్ డౌన్ సడలింపుల గురించి కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉందని సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: