భారత్ లో ఐపిఎల్ జరిగే అవకాశాలు ఉన్నాయా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. దేశ వ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్ ని కేంద్రం ప్రకటించింది. దీనిలో భాగంగానే కొన్ని గైడ్ లైన్స్ ని కేంద్ర సర్కార్ ఈ సందర్భంగా విడుదల చేసింది. ఈ నేపధ్యంలోనే ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ మైదానాలకు, కాంప్లెక్స్ లకు అనుమతి ఇచ్చింది కేంద్రం. 

 

దీనితో రెండు మూడు మైదానాల్లో ఐపిఎల్ ని నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. ముందు విదేశీ ఆటగాళ్లను అందరిని తీసుకొచ్చి వారిని క్వారంటైన్ చేసి ఆ తర్వాత 28 రోజులు చూసిన తర్వాత అప్పుడు మ్యాచ్ లకు అనుమతి ఇస్తారు. వాళ్ళు ప్రయాణం చేసే బస్ లు కార్లు అన్నీ కూడా శానిటేషన్ చేస్తారు. వారి కుటుంబ సభ్యులు ఇండియా కు రావడానికి వీలు లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: