దేశ వ్యాప్తంగా కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఇక కరోన ఇప్పుడు ఉద్యోగులకు వ్యాపారులకు కూడా క్రమంగా విస్తరించడం ఆందోళన కలిగిస్తుంది. అటు పోలీసులు కూడా భారీగా కరోనా బారిన పడుతున్నారు. ఇక ఉత్తరాది రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యంత వేగంగా నమోదు అవుతున్నాయి. ఉత్తరాది రాష్ట్రాల్లో పోలీసులకు ఉద్యోగులకు కరోనా సోకుతుంది. 

 

తాజాగా ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫ్యాక్టరీ కంపెనీ లో కరోనా కేసులు బయటపడ్డాయి. గ్రేటర్ నోయిడాలోని ఒప్పో మొబైల్ కంపెనీ కర్మాగారంలోని ఆరుగురు ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. దీనితో ఫ్యాక్టరీలో అన్ని కార్యకలాపాలు నిలిపివేయబడ్డాయి. అక్కడ కార్యకలాపాలు 2020 మే 9 న తిరిగి ప్రారంభమయ్యాయి. ఉద్యోగులు అందరూ క్వారంటైన్ కి వెళ్ళారు.

మరింత సమాచారం తెలుసుకోండి: