రాష్ట్రంలో టమోటా ధరల పతనం వెనుక న్యూస్ ఛానల్ ఉంది అంటూ మహారాష్ట్ర మాజీ సిఎం పృథ్వీ రాజ్ చవాన్ విమర్శలు చేసారు. ధరలు పతనం వెనుక హిందీ న్యూస్ ఛానల్ ఉందని, ఆ ఛాన‌ల్‌పై నెల‌రోజుల పాటు నిషేధం విధించాల‌ని, ఆ ఛానల్ ఒక వార్తాకథనాన్ని ప్రసారం చేసిందని, ఈ కార‌ణంగానే ట‌మాటా ధరలు క్షీణించడం ప్రారంభించాయని పెర్కొన్నారు. 

 

మే 13 న టమోటాలలో తిరంగ వైరస్ ఉందని ప్రచారం చేసిందని అందుకే టమోటా రైతులు నష్టపోయారు అని ఆయన పేర్కొన్నారు. ఈ తరహా బాధ్యతారహితమైన రిపోర్టింగ్ చేసినందుకు ఆ ఛాన‌ల్‌పై చ‌ర్య‌లు చేప‌ట్టాల‌నని ఆయన డిమాండ్ చేయడం గమనార్హం. ప్రభుత్వం రైతులకు పరిహారం చెల్లించాలని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: