దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా మాయదారి కరోనా వైరస్ ప్రభావం కనిపిస్తుంది.  చైనాలోని పుహాన్ లో పుట్టకొచ్చిన ఈ వైరస్ అత్యంత స్వల్ప సమయంలోనే దేశాలన్నీ చుట్టేసింది.  ప్రపంచంలో ఇప్పుడు కరోనా పేరు చెబితే గజ గజలాడిపోతున్నారు.  అగ్ర దేశమైన అమెరికాలో 82 వేల మంది చనిపోయారంటే ఇక్కడ పరిస్థితి కరోనా తీవ్రత ఎంతగా ఉందో అర్థం అవుతుంది.  మనదేశంలో ఫిబ్రవరి నుంచి మొదలైన ఈ కేసులు రోజు రోజుకీ పెరిగిపోతూ.. లక్ష చేరువలోకి వెళ్లింది.   మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి. దేశంలో ఎక్కువ కేసులు మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ లో ఎక్కువగా నమోదు అవుతున్నాయి.. అలాగే ఢిల్లీలో కూడా పెరిగిపోతున్నాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 299 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

 

దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 10,05కు పెరిగింది. ఈ వైరస్‌ బారిన పడినవారిలో 4485 మంది బాధితులు కోలకున్నారు. మరో 5409 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 283 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు ఈ ప్రాణాంతక వైరస్‌తో 160 మంది మరణించారు.  దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో కొత్తగా 5242 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 157 మంది మృతిచెందారు.  దేశంలో కరోనా కేసులు 96169కి చేరాయి. ఇప్పటివరకు 1198 మంది మరణించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: