గుంటూరు జిల్లా బాపట్లలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది. రోడ్డు మీదే పోలీసులు వీ ఆర్వో కొట్టుకున్నారు. బైక్ పార్కింగ్ విషయంలో వచ్చిన గొడవ ఈ ఘటనకు దారి తీసింది. ఒకరిపై ఒకరు కేసులు కూడా నమోదు చేసారు. అసలు జరిగింది ఏంటీ అంటే... ఆదివారం పెదపులిగురివానిపాలెం వీఆర్వో శివారెడ్డి కర్లపాలెంలోని ఓ మెడికల్ షాపుకు వెళ్ళగా అక్కడ బైక్ పార్క్ చేస్తున్న సమయంలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్ అడ్డుకుని వద్దన్నారు. 

 

దీనితో మాటా మాటా పెరిగింది. ఒకరిపై ఒకరు బూతులు కూడా తిట్టుకున్నారు. పోలీసులు, వీర్వో కొట్టుకునేంత వరకు కూడా ఈ వివాదం వెళ్ళింది. ఈ గొడవను చూసిన అక్కడి జనాలు షాక్ అయ్యారు. కలిసి పని చెయ్యాల్సిన వాళ్ళు ఇలా కొట్టుకోవడం ఏంటీ అంటూ పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: