హరీష్ శంకర్ తో తాను సినిమా చేయను అంటూ హాస్య నటుడు బండ్ల గణేష్ చేసిన ప్రకటనపై ప్రముఖ నిర్మాత పీవీపీ స్పందించి... “పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీష్ శంకర్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. 

 

వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు, నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయిటింగ్ అంటూ ట్వీట్ చేయగా దీనిపై హరీష్ శంకర్ స్పందించారు. “మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం” అని ట్వీట్ చేసాడు. తన వర్క్ ని గుర్తించినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: