భారత దేశంలో సూళ్లూరు పేటకు ఓ ప్రత్యేక స్థానం ఉంది.. ఈ పేరు చెబితే వెంటనే  శ్రీహరికోట గుర్తుకు వస్తుంది. భారత దేశ ఖ్యాతిని పెంపొందిస్తున్న రాకెట్ ప్రయోగాలు ఇక్కడ నుంచే జరుగుతాయి. అంతే కాదు ఇక్కడ పుణ్యక్షేత్రాలు కూడా బాగా ఉన్నాయి. అలాంటిది సూళ్లూరుపేట కరోనా పాజిటివ్ కేసుల సెగ శ్రీహరికోటను సైతం తాకింది. గత కొన్ని రోజులుగా  సూళ్లూరుపేటలో కరోనా విజృంభిస్తోంది. తాజాగా శుక్రవారం అయిదు కేసులు నమోదయ్యాయి. ఇందులో మహదేవయ్య నగర్‌లో మూడు, వనంతోపులో ఒకటి, మరోకేసు పట్టణంలో నమోదైంది. కాగా,  కోవిడ్ కేసులు నమోదు కానంత వరకూ తాము జనరల్ డ్యూటీలు చేయలేమని షార్ ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. షార్ రెండో గేటు వద్ద ధర్నావారంతా ధర్నాకు దిగారు. దీంతో షార్ ఉన్నతాధికారులు ఒప్పుకోక తప్పలేదు.

 

ఏపీ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 52 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 52 కేసుల్లో 19 కోయంబేడు మార్కెట్‌తో సంబంధం కలిగినవే ఉన్నాయి. ఈ రోజు నమోదైన పాజిటివ్‌ కేసుల్లో చిత్తూరు జిల్లాలో 15, కృష్ణా జిల్లాలో 15, నెల్లూరులో 7, తూర్పుగోదావరిలో 5, కర్నూలులో 4, కడప, పశ్చిమగోదావరిలో రెండు చొప్పున, విజయనగరం, విశాఖపట్నంలో ఒక్కో కొత్త కేసు ఉన్నాయి.  కర్నూలులో తాజాగా మరో 28 మంది కోవిడ్‌ను జయించి..ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో జిల్లాలో ఇప్పటి వరకు కోవిడ్‌ విజేతల సంఖ్య 403కు చేరుకుంది. ఇది మొత్తం కేసుల్లో 71 శాతంగా ఉండటం విశేషం. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 159 మంది (26 శాతం) మాత్రమే చికిత్స పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: