రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్ ఆర్‌ ఆర్ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన వెలువడింది. కరోనా వైర‌స్ క‌ట్ట‌డికి దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న‌లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు కేంద్ర ప్ర‌భుత్వం పొడిగించిన విష‌యంత తెలిసిందే. లాక్‌డౌన్‌ను మ‌ళ్లీ పొడిగించడంతో తన పనిని పూర్తి చేయలేక పోతున్నామని, సకాలంలో పని కొనసాగించ లేక పోతున్నామని చిత్రయూనిట్ పేర్కొంది.

 

అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేక పోతున్నామని పేర్కొంది. అయితే.. సినిమాకు సంబంధించి ఫ‌స్ట్‌లుక్‌ ఎప్పుడు విడుదలైనా మీ అందరికీ పెద్ద పండుగని తెస్తుందని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ ప్ర‌క‌ట‌న‌తో అభిమానులు తీవ్ర నిరాశ‌లో మునిగిపోయారు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: