తెలంగాణలో ఇప్పటి వరకు కరోనా కేసులు లేని కొన్ని ప్రాంతాలు ఉన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు యాదాద్రి జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.. కానీ ఈ మద్య భువనగిరిలో కేసులు మొదలయ్యాయి.  ఇటీవల ముంబాయి నుంచి వచ్చిన వారికి కరోనా పాజిటీవ్ గుర్తించి వారికి క్వారంటైన్ కి తరలించారు.  తాజాగా ఇప్పుడు ఖమ్మం జిల్లా మధిర మండలంలో తొలి కరోనా పాజిటివ్‌ కేసు నమోదైంది. మహదేవపురం గ్రామానికి చెందిన 17 మంది ఈ నెల 14న మహారాష్ట్ర నుంచి వచ్చారు.  అయితే వారు వచ్చిన తర్వాత తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో వెంటనే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు రక్తనమూనాలు సేకరించి పరీక్షలకు పంపారు

 

. వారిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డాక్టర్‌ మాలతి తెలిపారు. వెంటనే ఆ ప్రాంతంలో హై అలర్ట్ అయ్యారు.. పలు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.. అంతే కాదు వచ్చిన వారు ఎవరెవరిని కలిశారన్న విషయంపై ఎంక్వేయిరీ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్‌ ఆర్‌వీ కర్ణన్‌ ఆదేశాల మేరకు మండల స్థాయి అధికారులంతా గ్రామంలో పర్యటిస్తూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మొగిలి స్నేహలత గ్రామంలోని క్వారంటైన్‌లో ఉన్నవారిని కలిసి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: