గత వారం రోజులు గా హైదరాబాద్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న హైదరాబాద్ చిరుత చనిపోయిందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. హైదరాబాద్ లోని గగన్ పహాడ్ వద్ద ఉన్న కాటేదాన్ లో రోడ్డు మీద కనపడిన చిరుత ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే మళ్ళీ కనపడింది. అటవీ శాఖ అధికారులు దాని కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టినా సరే పెద్దగా ఫలితం లేదు. 

 

చిలుకూరు అటవీ ప్రాంతం హిమాయత్ సాగర్ అటవీ ప్రాంతం అని ప్రచారం జరిగింది గాని కనీసం చిరుత ఆచూకి కెమెరాల్లో కూడా దొరకలేదు. అయితే ఇది మృతి చెంది ఉండవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. అందుకే కనపడటం లేదని దాని ఆచూకి తెలిసిన రోజు అది గాయాలతో ఉందని ఆ గాయాలు తీవ్రమై మరణించి ఉండవచ్చు అని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: