మొన్నటి వరకు కరోనా జీరో కేసులు గా ఉన్న మంచిర్యాలలో ఇటీవల ఒక్కో కేసు నమోదు అవుతు వచ్చింది. అయినా అక్కడ పెద్దగా డేంజర్ లేదని అధికారులు తెలిపారు. అయితే ఇప్పుడు లాక్ డౌన్ సడలింపులు.. వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లొచ్చు అని కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇప్పుడు ముంబాయి నుంచి చాలా మంది వలస కార్మికులు ఏపి, తెలంగాణలో వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నారు. ఇప్పటి వరకు ముంబాయిలో విపరీతమైన కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ముంబాయి నుంచి వచ్చిన వారికి కరోనా ఉండటం పెద్ద సమస్యగా మారుతుంది. తెలంగాణ గ్రామల్లో వలస కార్మికుల రాక కొత్త ఆందోళనకు కారణమౌతోంది. చాలా మంది వలస కూలీలు ముంబై నుంచి సొంత ఊళ్లకు చేరుకుంటుండటంతో చాలా మందికి వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి.

 

జగిత్యాల,ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాల్లో ఈ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా 7 మంది ముంబై నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఈ సంఖ్య 17కు చేరింది. వారందరిని బెల్లంపల్లి,తాళ్ల గురిజాల క్వారంటైన్ కు చెందిన వారిగా గుర్తించారు.  కాగా, రోగులతో సన్నిహితంగా ఉన్న వారిని గుర్తించి హోం క్వారంటైన్ ఉండాలని సూచిస్తున్నారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన కేసుల్లో 17 మంది ముంబై వలస కూలీలే ఉండటం విశేషం. 

మరింత సమాచారం తెలుసుకోండి: