తెలంగాణాలో నియంత్రిత పంటల విషయంలో సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. రైతులను ఆర్ధికంగా బలోపేతం చేసే ఉద్దేశం లో ఉన్న కేసీఆర్ సర్కార్ ఇప్పుడు వారికి పంటల విషయంలో ఆదాయం వచ్చే మార్గాలను సూచిస్తుంది అని సమాచారం. నేడు కేసీఆర్ నియంత్రిత పంటల విషయంలో అధికారులతో రైతులతో భారీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 

 

ఈ సమావేశంలో రైతుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఇక కేబినేట్ సమావేశంలో కేసీఆర్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. చెప్పని పంటలను వేస్తే రైతు బంధు పథకం ఇచ్చేది లేదని ఈ వర్షా కాలం నుంచే నియంత్రిత పంటల సాగు అనేది అందుబాటు లోకి వస్తుంది అని కేబినేట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనిపై కేబినేట్ సమావేశంలో నిర్ణయం వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: