దేశంలో ప్రస్తుతం లాక్ డౌన్ 4.0 కొనసాగుతుంది. మార్చి 24 నుంచి ప్రారంభమైన కరోనా లాక్ డౌన్ నిన్నటితో ముగిసినప్పటికీ.. తిరిగి నేటి నుంచి ఈ నెల 31 వరకు కొనసాగుతుందని చెప్పారు.  ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల పరిస్థితులను బట్టి లాక్ డౌన్ సడలింపులు... నిర్దేషికాలు జారీ చేయొచ్చని చెప్పారు.  అయితే దేశంలో మాత్రం కరోనా రోజు రోజుకీ  విజృంభిస్తోంది. ఈ మహమ్మారి కట్టడికోసం ప్రపంచమంతా లాక్‌డౌన్ లో ఉండిపోయింది. కాగా.. ఛత్తీస్‌గఢ్ లో మరో మూడు నెలలపాటు కర్ఫ్యూ పొడిగించారు. కరోనా మహమ్మారి కట్టడికోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది.

 

ప్రస్తుతం దేశంలో మహారాష్ట్ర,గుజరాత్, తమిళనాడు లో ఎక్కువగా కరోనా తీవ్రత ఉందన్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో కరోనా ప్రభావం పడకుండా చూసేందుకు అన్ని కట్టుబాటు చర్యలు తీసుకుంటున్నారు.  చాలా ప్రాంతాల్లో కరోనా ప్రభావం ఒక్కసారిగా పెరగొచ్చని కలెక్టరలందరు ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశారని ప్రభుత్వం పేర్కొంది. ఆదివారం నాడు 25 కొత్త కేసులు నమోదుకావడంతో మొత్తం కేసుల సంఖ్య 92కు చేరుకుంది. 32 మంది చికిత్స పొందుతుండగా.. 59 మంది కోలుకుని ఇళ్లకు చేరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: