కేబినేట్ సమావేశం అనంతరం తెలంగాణా సిఎం కేసీఆర్ మీడియా తో మాట్లాడారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేసారు కేసీఆర్. హైదరాబాద్ మినహా అన్ని ప్రాంతాలకు షాపులు తెరుచుకోవచ్చు అని ఆయన స్పష్టం చేసారు. అదే విధంగా రేపటి నుంచి వంద శాతం సిబ్బంది తో ప్రభుత్వ ప్రైవేట్ ఆఫీసులు అన్ని తెరుచుకోవచ్చు అని ఆయన స్పష్టం చేసారు. 

 

పరిశ్రమలకు రేపటి నుంచి అనుమతులు ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమలు తమ కార్యకలాపాలను నిర్వహించుకోవచ్చు అని ఆయన స్పష్టం చేసారు. సెలూన్ లకు కూడా అనుమతి ఇస్తున్నామని ఈ సందర్భంగా చెప్పారు. ఆర్ధికంగా ఇబ్బంది పడకూడదు కాబట్టి ప్రజల నుంచి సహకారం అవసరం అని కేసీఆర్ విజ్ఞప్తి చేసారు. దండం పెట్టి చెప్తున్నా అని అనవసరంగా బయటకు రావొద్దు ని ఆయన కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: