తెలంగాణాలో అన్ని రకాల పంటలు పండుతున్నాయని, ఏ దేశంలో కూడా ఇలాంటి పరిస్థితి లేదని రాష్ట్ర సిఎం కేసీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతులకు ఆర్ధిక సహాయం చేస్తున్నామని చెప్పారు. ఓడిశా లో ఇస్తున్నారు అని కాని తెలంగాణా స్థాయిలో ఇవ్వడం లేదని ఆయన పేర్కొన్నారు. 

 

రైతులకు బీమా ఈ ఏడాది 1100 కోట్ల వరకు కట్టామని అన్నారు. అద్భుతమైన వ్యవసాయ౦ తెలంగాణా లో ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక రైతుల‌కు బంప‌ర్ ఆఫ‌ర్‌ ఇచ్చారు కేసీఆర్. మైక్రో ఇరిగేష‌న్ ఎస్సీ , ఎస్టీల‌కు 100మిగిలిన వాళ్ల‌కు 90 శాతం సబ్సిడీ ఇస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణా రైతులు నియంతృత్వ వ్యవసాయం చెయ్యాలి అని ఆయన విజ్ఞప్తి చేసారు. 2,604 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటు చేసామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: