తెలంగాణాలో రైతులకు ఆదాయం బాగా రావాలి అంటే కచ్చితంగా పత్తి చేను వెయ్యాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణాలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్తు ఉందని గత ఏడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పంట పండింది అని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా ఈ ఏడాది 70 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేసుకోవాలని కేసీఆర్ సూచించారు. 

 

40 లక్షల ఎకరాల్లో వరి వేసుకోవాలని 15 లక్షల ఎకరాల్లో కంది పంట వేసుకోవాలని వర్షా కాలంలో మక్కలు వేయొద్దని కేసీఆర్ సూచించారు. 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించుకోవచ్చు అని ఆయన పేర్కొన్నారు. పత్తి పంటను వేసుకోవడానికి అందరూ ముందుకు రావాలని ఆయన సూచించారు. వర్షా కాలంలో మక్క పంటకు డిమాండ్ లేదని ఆయన స్పష్టం చేసారు. అదిలాబాద్ నిజామాబాద్  జిల్లాల్లో సోయా పంట వేసుకోవచ్చు అని పేర్కొన్నారు కేసీఆర్.

మరింత సమాచారం తెలుసుకోండి: