తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని పత్తికి అద్భుతమైన భవిష్యత్ ఉందని అన్నారు. పత్తిలో మరింత క్వాలిటీ పెంచే దిశగా ప్రయత్నాలు చేయాలని అన్నారు. రైతులు ఏ పంటలు వేయాలో ఇప్పటికే అధికారులకు సూచించామని అన్నారు. రైతులు ప్రభుత్వ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అన్నారు. రైతులు ఇష్టం వచ్చిన పంట వేస్తే రైతు బంధు కట్ చేస్తామని కేసీఆర్ అన్నారు. 
 
ఎక్కువ మంది ఒకే పంట వేస్తే అమ్మబోతే అడవి కొనబోతే కొరివి పరిస్థితి ఏర్పడుతుందని అందువల్ల రైతులు ప్రభుత్వం సూచించిన పంటలు మాత్రమే వేయాలని చెప్పారు. ప్రభుత్వ సూచనలు పాటించి రైతులు లాభాలు అందుకోవాలనే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఏ పంటలు వేస్తే లాభమో ఆ పంటలు వేసి రైతులు లాభాల బాట పట్టాలని కోరుకుంటున్నానని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: