రాష్ట్రాలను కేంద్రం బెగ్గర్స్ గా భావించింది అని తెలంగాణా సిఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. అన్నీ మీరు చెప్తే రాష్ట్రాలు ఎందుకు అని ఆయన కేసీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం కట్టుకునే అప్పులకు కేంద్రం షరతులు ఏంటీ అని ఆయన ప్రశ్నించారు. ఇది ఫెడరల్ వ్యవస్థ కాదని కేసీఆర్ పెరోన్నారు. రాష్ట్రాలతో బేరాలు ఆడతారా అని కేసీఆర్ నిలదీశారు. 

 

కేంద్రం ప్యాకేజి అంతా అంకెల గారడీ అంటూ కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రాల చేతుల్లోకి నగదు రావాలని ఆయన పేర్కొన్నారు. తెలంగాణకు ఒరిగింది ఏమీ లేదని ఆయన ఆరోపించారు. అన్నీ దరిద్రపు షరతులు అంటూ మండిపడ్డారు. ఇది పచ్చి మోసం అని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏంటీ అని ఆయన నిలదీశారు. ఇది పద్ధతి కాదన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: