రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపిన కృష్ణా వరద జలాలపై తెలంగాణా సిఎం కేసీఆర్ తొలిసారి స్పందించారు. పోతిరెడ్డిపాడు గురించి తాను ఇప్పుడు మాట్లాడటం లేదని కేసీఆర్ అన్నారు. సమయం వచ్చినప్పుడు మాట్లాడతాం అని పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలని మళ్ళీ చెప్తున్నామని అన్నారు. తాము నిబంధనలకు అనుగుణం గానే నీటిని వాడుకుంటున్నాం అని పేర్కొన్నారు. 

 

ఏపీ ప్రభుత్వం లేఖ ఇప్పుడే రాసిందని అన్నారు. రాయలసీమకు నీళ్ళు అవసరం అనుకున్నప్పుడు గోదావరి నుంచి తీసుకుని వెళ్ళాలి అని ఆయన సూచించారు. ఎవరు మిగులు జలాలు వాడుకున్నా సరే తమకు ఇబ్బంది లేదని ఆయన పేర్కొన్నారు. రాయలసీమకు నీళ్ళు ఇచ్చే విషయంలో తాను ఇప్పటికి కట్టుబడే ఉన్నామని ఆయన అన్నారు. ఏపీ ప్రభుత్వం జీవో ని వ్యతిరేకించామని ఈ సందర్భంగా కేసీఆర్ వివరించారు. రాయలసీమకు కచ్చితంగా నీళ్ళు పోవాలని అన్నారు. గోదావరి లో జలాలు ఉన్నాయని చెప్పారు. నీటి వాటాలపై తమకు అవగాహన ఉందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: