తెలంగాణ సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రానికి రాష్ట్రాలు సబార్డినేట్లు కావని అన్నారు. రాష్ట్రాలపై పెత్తనం చేయడం సమాఖ్య వ్యవస్థకు విఘాతం కలిగిస్తుందని అన్నారు. కేంద్రం పెట్టిన షరతులతో ఇప్పటికే మూడు లాక్ డౌన్ లు పూర్తి చేశామని అన్నారు. కేంద్ర సాయం ఉత్త బోగస్ అని చెప్పారు. రాష్ట్రాలను కేంద్రం బిచ్చగాళ్లుగా భావించిందని అన్నారు. కేంద్రానివి అన్నీ దరిద్రపు షరతులు అని అన్నారు. 
 
అన్నీ కేంద్ర ప్రభుత్వాలే చెబితే రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. కేంద్రం తన పరువును అదే తీసుకుంటోందని అన్నారు. కేంద్రం ఇచ్చే ముష్టి 2500 కోట్ల రూపాయలు అవసరం లేదని అన్నారు. కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాల విషయంలో వైఖరి మార్చుకోవాలని అన్నారు. రాష్ట్రంలో ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను పొడిగిస్తామని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: