తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్ డౌన్ పొడిగింపు, ఇతర విషయాల గురించి మీడియాతో మాట్లాడారు. కేంద్రం పలు నిర్ణయాల విషయంలో తెలంగాణను ఫాలో అవుతుందని అన్నారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పచ్చి దగా, మోసం ని కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ అని కేసీఆర్ అన్నారు. తెలంగాణ  పట్ల కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను నిర్వీర్యం చేస్తారా అని ప్రశ్నించారు. 
 
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల విషయంలో దారుణంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే రుణం ఇస్తామనడం ప్యాకేజీ అవుతుందా...? అని ప్రశ్నించారు. ఎఫ్.ఆర్.బీ.ఎం పరిమితులు పెంచుతూ కేంద్రం ఆంక్షలు పెట్టిందని అన్నారు. కేంద్రం ప్యాకేజీపై సీఎం కేసీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: