తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నామని ప్రకటన చేశారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం కృషి చేస్తామని అన్నారు. నీటి సమస్యల విషయంలో పరిష్కారం లభిస్తుందనే నమ్మకం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో జల వివాదాల విషయంలో బస్తీమే సవాలైంది అని సెటైర్లు వేశారు. జగన్ తో తనకు ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. 
 
రాష్ట్ర ప్రభుత్వం ఒకటి కోరితే కేంద్రం మరొకటి ఇచ్చిందని చెప్పారు. మున్సిపాలిటీల్లో చార్జీలు పెంచితే రుణ పరిమితి పెంచుతారా అని ప్రశ్నించారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీని ప్యాకేజీ అంటారా...? అని ప్రశ్నించారు. కరోనా విపత్తు సమయంలో కేంద్రం వ్యవహరించిన తీరు సరికాదంటూ విమర్శలు చేశారు. కేంద్రం నిబంధనలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామంటే ఆ రుణాలు అవసరం లేదని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: