రాజోలు లో ఓ ఐస్ ఫ్యాక్టరీ నుండి అమ్మోనియం గ్యాస్ సీలిండర్ ఒక్కసారిగా పేలిపోవడంతో ఆ వాయువు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు వ్యాపించి ప్రజలను ఊపిరి సలపకుండాచేసింది. ఘటనా స్థలాన్ని పోలీసులు మరియు రెవిన్యూ అధికారులు హుటాహుటిన అక్కడకు చేరుకొని  ఆ ఫ్యాక్టరీ కి 200 మీటర్ల దూరంలో ఉన్న గ్రామ ప్రజలను ఖాళీ చేయిస్తూ వున్నారు. ఈ వాయువును పీల్చిన కొందరి పరిస్థితి ఆందోళన కరంగా ఉండని అధికారులు చెబుతున్నారు.

 

 

అయితే ఈ సంఘటన గురించి అధికారులు చెబుతూ ఐస్ కోసం భారీగా అమోనియం వినియోగిస్తున్న సమయంలో గ్యాస్ ఒక్కసారిగా లీక్ అయ్యిందని చెబుతున్నారు. అయితే ఆ ఫ్యాక్టరీ లో వందకు పైగా గ్యాస్ సీలిండర్స్ ఉన్నాయ్ అని అధికారులు చెబుతున్నారు. విశాఖ ఎల్జి పాలిమర్స్ దుర్ఘటన మరువకముందే ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఒకింత భాదకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి ప్రమాదాలు ఉన్న పరిశ్రమలను గుర్తించి తగు జాగర్తలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: