దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య లక్ష దాటగా, కరోనా మృతుల సంఖ్య 3,000 దాటింది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ చిగురుటాకులా వణికిస్తోంది. ఆర్థిక రంగ నిపుణులు పలు దేశాలు లాక్ డౌన్ ను ప్రకటించడం వల్ల పెను ఆర్థిక ముప్పును ఎదుర్కోబోతున్నాయని చెబుతున్నారు. పలు సర్వేలు లాక్ డౌన్ వల్ల అభివృద్ధి చెందిన దేశాలు సైతం తీవ్ర ఇబ్బందులు పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. 
 
ఆర్థిక రంగ నిపుణులు లాక్ డౌన్ ప్రకటించిన దేశాలు అన్నీ ఊహించని స్థాయిలో ఆర్థిక ఉత్పాతాన్ని చవిచూడాల్సి వస్తుందని చెబుతున్నారు. భారత్ లో ఆకలి కేకలు వినిపించే అవకాశం ఉందని... లాక్ డౌన్ ను ఇలాగే పొడిగిస్తే రాబోయే రోజుల్లో అసలు ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మేధావి వర్గాలు మాత్రం కేంద్రం దేశంలోకి ఒక్క కరోనా రోగి కూడా రాకుండా చేయగలిగి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: