దాదాపు రెండు నెలల తర్వాత తెలంగాణాలో ఆర్టీసి బస్సులు రోడ్దేక్కాయి. ఇన్ని రోజులు ఆర్టీసి బస్సుల కోసం ఎదురు చూసిన జనాలకు తెలంగాణా ప్రభుత్వం ఊరట ఇచ్చింది. నిన్న జరిగిన కేబినేట్ సమావేశంలో తెలంగాణాలో ఆర్టీసీ బస్సులు అనుమతి ఇస్తున్నామని సిఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

 

దీనితో తెలంగాణాలో ఆర్టీసి బస్సులు రోడ్దేక్కాయి. ఫుట్ బోర్డ్ ప్రయాణాలకు నో చెప్పింది ఆర్టీసి. అదే విధంగా సీట్లలో కూడా దూరంగా కూర్చోవాల్సిన అవసరం ఉంది. మాస్క్ లు భౌతిక దూరం అనేది తప్పనిసరి చేసింది తెలంగాణా సర్కార్. మాస్క్ లు ఉంటేనే బస్ లు ఎక్కించుకునే పరిస్థితి ఉంది. ప్రస్తుతం హైదరాబాద్ లో సిటీ బస్ లకు అనుమతి ఇవ్వలేదు తెలంగాణా ప్రభుత్వం.

మరింత సమాచారం తెలుసుకోండి: