ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో అంఫాన్ తుఫాన్ ప్రభావం కనపడుతుంది. తుఫాన్ తీవ్రత గంట గంట కు పెరగడం తో సముద్ర తీర ప్రాంతాల్లో అలజడి రేగింది. తీరం వెంబడి వంద కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడలోని ఉప్పాడ సముద్ర తీరంలో నాటు పడవలు ద్వంశం అయ్యాయి. అదే విధంగా విశాఖలో కూడా అదే పరిస్థితి ఉంది. 

 

ఇక నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పోర్ట్ లో కూడా పరిస్థితి మరింత ఆందోళన కరంగా ఉంది. బెంగాల్, ఓడిస్సా తీర ప్రాంతాల్లో అలజడి రేగింది. సముద్రం ముందుకు వచ్చేసింది. దీనితో మత్య్స కారుల ఇళ్ళల్లో నీళ్ళు వెళ్ళాయి. సముద్రంలో ప్రస్తుతం పరిస్థితులు బాగా లేదు అని కాబట్టి వేటకు వెళ్ళవద్దు అని అధికారులు హెచ్చరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: