దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా విజృంభిస్తోంది. నిన్న ఒక్కరోజే దేశవ్యాప్తంగా 4,641 కరోనా కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా కరోనా మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో 130 మంది మృతి చెందగా మృతుల సంఖ్య 3,159కు చేరింది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 1,00,340 కు చేరుకుంది. రోజురోజుకు కేసుల సంఖ్య, మృతుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. 
 
దేశంలో నమోదవుతున్న కేసుల్లో మూడో వంతు కేసులు మహారాష్ట్రలోనే నమోదవుతున్నాయి. తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య అరకోటికి చేరువలో ఉన్నాయి. 48 లక్షల 50 వేల మంది కరోనా భారీన పడగా మూడు లక్షల 18 వేల మంది మృతి చెందారు. ప్రపంచవ్యాప్తంగా నమోదైన కేసుల్లో 15 లక్షల కేసులు అమెరికాలో నమోదు కాగా 3,00,059 కేసులు న్యూయార్క్ లో నమోదయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: