ఇప్పుడు వేలాది మంది లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి రోడ్డున పడిన సంగతి తెలిసిందే. తినడానికి తిండి లేక కొందరు పడే బాధల గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభుత్వాలు సహాయం చేసినా సరే అందాల్సిన వారికి ఆ సాయం అందడం లేదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దీనితో కొందరు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి.

 

తాజాగా తమిళనాడు లోని కాంచీపురం జిల్లాలో శ్రీపెరంబదూర్ లో ఆర్ముగం అనే ఒక కూలీ ఉపాధి కోల్పోయాడు. కుటుంబాన్ని పోషించలేక అతను తన పిల్లలను చంపి తాను కూడా చనిపోయాడు. అతనికి భార్య కూడా ఉన్నా భార్యను మాత్రం చంపలేదు. ఈ ఘటన అక్కడ వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వం సాయ౦ చేయలేదు అని ఆరోపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: