దేశ వ్యాప్తంగా వలస కూలీలను తమ సొంత ప్రాంతాలకు తరలిస్తున్నాయి ప్రభుత్వాలు. ఉపాధి లేకపోవడం దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలకు భారంగా మారడం తో వారిని సొంత రాష్ట్రాలకు తరలించే కార్యక్రమం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా వరకు అప్రమత్తంగా వ్యవహరిస్తు వస్తుంది. వారి కోసం శ్రామిక్ రైళ్ళను ఏర్పాటు చేసింది. 

 

ఇక తెలంగాణా నుంచి భారీగా వలస కూలీలను తరలిస్తున్నారు. తాజాగా వలస కూలీల విషయంలో ఇక లాటరీ విధానం పాటించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో రైల్లో 1400 నుంచి 1500 మంది వెళ్లే అవకాశం ఉండటం తో దాదాపు 4 లక్షల మంది పైగా కూలీలు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఒక్క రైలు కి ప్రతీ ప్రాంతం నుంచి 10 నుంచి 15 మందికి అవకాశం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: