దేశంలో ఫిబ్రవరిలో మొదలైన కరోనా కేసులు పెరిగి పెరిగి ప్రభంజనం అయ్యాంది.  ఇప్పటికీ దేశంలో లక్ష కేసులు నమోదు అయ్యాయి. ఇక కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 1,01,139కి చేరింది. మరోపక్క, ఇప్పటి వరకు కరోనా నుంచి 39,173 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 3,163కి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 4.0 లాక్ డౌన్ మొదలైంది.  అయితే రాష్ట్రాల పరిస్థితులను బట్టి వెసులు బాటు కల్పించేందుకు కేంద్రం ఓకే చెప్పింది. కరోనా పరిస్థితులను బట్టి లాక్ డౌన్ సడలింపు.. కొత్త మార్గదర్శకాలు రాష్ట్ర ముఖ్యమంత్రలు  సూచిస్తున్నారు.  ఈనేపథ్యంలో నిన్న రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొన్ని మార్గదర్శకాలు సూచించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో సరి - బేసి విధానంలో దుకాణాలు తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

 

ఈ మేరకు ఉదయం నుంచి వివిధ ప్రాంతాల్లో బల్దియా అధికారులు పర్యటిస్తున్నారు. దుకాణాలు తెరిచేందుకు బల్దియా అధికారులు అనుమతులు ఇస్తున్నారు. సరి - బేసి విధానం పాటించకపోతే దుకాణాలు మూసివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. రూల్ప్ ఏమాత్రం బ్రేక్ చేసినా దుకాణాలు మూయాల్సి ఉంటుందని హెచ్చరించారు.  దుకాణదారు మాస్క్‌ ధరించి శానిటైజర్‌ అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. మాస్క్‌ ధరించిన వినియోగదారుకే సరుకులు ఇవ్వాలని ఆదేశించారు అధికారులు. మాస్కులు ధరించకపోతే రూ. వెయ్యి జరిమానా విధిస్తామని బల్దియా అధికారులు స్పష్టం చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: