ఆంధ్రప్రదేశ్ లో విద్యా సంస్కరణల దిశగా ఏపీ సర్కార్ కీలక అడుగులు వేస్తున్నారు. నాలుగున్నర ఐదేళ్ళ పిల్లలకు ప్రీ స్కూల్స్ అడ్మిషన్లు ప్రభుత్వ స్కూల్స్ లో ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ప్రీ స్కూల్స్ లో అవసరమైన సిలబస్ పై ఫోకస్ చేసారు. పిల్లల్లో ప్రతిభ వెలికి తీసే విధంగా సిలబస్ ఉండటం, లెక్కల సబ్జెక్ట్ పై స్పెషల్ ఫోకస్ చేయనున్నారు. 

 

ఆ తర్వాత ఒకటో తరగతిలోకి విద్యార్ధులకు ప్రవేశం ఉంటుంది. తొలి విడతగా గిరిజన వెనుకబడిన ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. అన్ని స్కూల్స్ లో దీని ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్దం చేస్తుంది ఏపీ సర్కార్. దీనిపై ఒక ప్రత్యేక కమిటి వేసే దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. త్వరలోనే దీనిపై ఒక జీవో ని కూడా విడుదల చేయనుంది.  గిరిజన ప్రాంతాల్లో ముందు పైలెట్ ప్రాజెక్ట్ గా వంద మంది పిల్లలను పది స్కూల్స్ కి తీసుకుని, ఆ తర్వాత మూడు నెలలు వారిలో మార్పుని గమనించి మరి కొంత మందిని  తీసుకోనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: