ఆంధ్రప్రదేశ్ లో మరో సంక్షేమ కార్యక్రమం దిశగా ఏపీ సర్కార్ అడుగులు వేస్తుంది. ఎన్నికల్లో పాదయాత్రలో తను ఏది అయితే హామీలు ఇచ్చానో వాటిని అమలు చేయడానికి జగన్ సిద్దమయ్యారు. జూన్ మొదటి వారంలో జగనన్న చేదోడు అనే పథకం మొదలుపెడతారు. రజకులు నాయి బ్రాహ్మణులూ, దర్జీలకు పది వేల ఆర్ధిక సహాయం చేస్తారు. 

 

రూ 2500 కోట్ల అర్హులు అయిన వృత్తి  పనుల లబ్దిదారులకు పంపిణి చేస్తుంది ఏపీ సర్కార్. బీసీ కార్పోరేషన్ ద్వారా వారిని ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఎంపిక పూర్తి అయింది. మొత్తం 2 లక్షల 50 వేల మందికి అందిస్తారు. ఈ నెల 25 వరకు గ్రామ వార్డు లబ్ది దారుల జాబితా ఉంటుంది. అభ్యంతరాలు ఫిర్యాదులతో వాలంటీర్ల ద్వారా సామాజిక తనిఖీలు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: