యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉండే ఎన్నారై లకు ఆ దేశం గుడ్ న్యూస్ చెప్పింది. వ్యక్తిగత అవసరాలు, ఉద్యోగ అవసరాలు, సెలవులతో కొందరు మన దేశానికి వచ్చేశారు. లాక్ డౌన్ కారణంగా వాళ్ళు అందరూ ఇక్కడే ఉండిపోయారు. దీనితో వారిని తిరిగి అక్కడికి వెళ్ళడానికి ఆ దేశం అనుమతి ఇచ్చింది. జూన్ 1 నుంచి తిరిగి యూఏఈ వ‌చ్చేందుకు అక్క‌డి స‌ర్కార్‌ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

 

రెసిడెంట్ వీసా, కుటుంబ స‌భ్యులు యూఏఈలో ఉన్న‌వారు జూన్ 1 నుంచి త‌మ దేశానికి తిరిగి రావొచ్చ‌ని ప్రకటన విడుదల చేసింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, అంతర్జాతీయ సహకార మరియు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ అండ్ సిటిజన్‌షిప్(ఐసీఏ) ఒక ప్రకటన చేసింది. ఎన్నారైలు దీని కోసం ఐసీఏకు సంబంధించిన‌ smartservices.ica.gov.ae వెబ్‌సైట్ ద్వారా 'రెసిడెంట్స్ ఎంట్రీ ప‌ర్మిట్‌'లో రిజిస్ట‌ర్ చేసుకోవాల‌ని అక్కడి ప్రభుత్వం సూచనలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: