తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల చివరి వారం పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈరోజు పదో తరగతి పరీక్షల గురించి హైకోర్టులో విచారణ జరిగింది. హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విని జూన్ మొదటి వారం తర్వాత పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జూన్ నెల 3వ తేదీన రాష్ట్రంలో కరోనా కేసుల గురించి సమీక్ష నిర్వహించాలని సూచించింది. 
 
సమీక్షకు సంబంధించిన నివేదికను 4వ తేదీన హైకోర్టుకు సమర్పించాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. పరీక్షలు నిర్వహించే సమయంలో కరోనా నివారణా జాగ్రత్తలు పాటించాలని కోర్టు పేర్కొంది. రాష్ట్రంలో పరిస్థితులు తీవ్రంగా ఉంటే మాత్రం పరీక్షలు నిర్వహించవద్దని చెప్పింది. కోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో జూన్ మొదటి వారం తరువాత పరీక్షలు జరిగే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: