ప్రపంచంలో కరోనా వైరస్ ప్రభావం మొదలైనప్పటి నుంచి ఎక్కువగా బలి అవుతుంది అమెరికా ప్రజలే.   ప్రపంచానికె పెద్దన్నగా చెప్పుకునే అమెరికా టెక్నాలజీ పరంగా ఎంతో ముందుంది. కానీ ఈ కరోనా వైరస్ కి మాత్రం ఇప్పటి వరకు వ్యాక్సిన్ కనుగొనలేకపోతుంది.. ఇప్పటి వరకు ప్రయోగాలు చేస్తూనే ఉంది.  కానీ జరిగే అనర్థం మాత్రం జరిగిపోతూనే ఉంది.  అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 21,551 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వైరస్‌ ప్రభావంతో కొత్తగా 785 మంది మరణించారు. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 15,03,308కి చేరింది. ఇప్పటివరకు 90,347 మంది బాధితులు మృతిచెందారు. 

 

ప్రపంచంలో రెండులక్షల మరణాల్లో దాదాపు మూడో వంతు అమెరికాలోనే సంబవిస్తుంది. దేశంలోని మొత్తం 50రాష్గ్రాల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. న్యూయార్క్‌లో అత్యధికంగా 3,51,371 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 28,339 మంది మరణించారు.  కరోనా కేసుల్లో ఇల్లినాయిస్‌, మసాచుసెట్స్‌, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో వరుసగా 96,485, 87,052, 81,738 కేసులతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. న్యూజెర్సీలో ఇప్పటివరకు 1,48,240 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ వైరస్‌ ప్రభావంతో 10,439 మంది మృతిచెందారు.

మరింత సమాచారం తెలుసుకోండి: