2018 - 2019 మ‌ధ్యకాలంలో ప్రాంతీయ పార్టీల ఆదాయ మార్గాలకు సంబంధించి నేషనల్ ఎలక్షన్ వాచ్, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) చేసిన సర్వేలో ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోని అన్ని ప్రాంతీయ పార్టీలకు 2018 - 2019లో 885.956 కోట్ల రూపాయల డొనేషన్స్ వచ్చాయి. ఈ విరాళాలలో దాదాపు సగం విరాళాలు అజ్ఞాత విరాళాలే అని తెలుస్తోంది. అజ్ఞాత విరాళాలు అందుకున్న పార్టీలలో బిజూ జనతా దళ్ (213 కోట్లు) తో అగ్ర స్థానంలో ఉంది. 
 
ఆ తరువాత స్థానంలో ఏపీకి చెందిన వైసీపీ 100 కోట్ల రూపాయల అజ్ఞాత విరాళాలతో రెండో స్థానంలో ఉంది. తెలుగుదేశం పార్టీకి 37.7 కోట్ల రూపాయల అజ్ఞాత విరాళాలు వచ్చాయి. బిజూ జనతా దళ్, వైసీపీ తరువాత, 60 కోట్ల రూపాయలతో మూడో స్థానంలో శివసేన, 39 కోట్ల రూపాయలతో జేడీఎస్ నాలుగో స్థానంలో ఉండగా టీడీపీ ఐదో స్థానంలో ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: