ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ భారీ షాక్ ఇవ్వనుందని తెలుస్తోంది. కొన్ని నెలల క్రితం బస్సు ఛార్జీలు పెంచిన జగన్ సర్కార్ తాజాగా మరోసారి పెంచాలని సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బస్సులో పరిమిత సంఖ్యలో ప్రయాణికులు ప్రయాణించాల్సి ఉంది. బస్సులను ప్రభుత్వం బస్టాండ్ నుంచి బస్టాండ్ వరకు మాత్రమే నడపనున్నారు. దీంతో ఆర్టీసీ ప్రభుత్వానికి ఛార్జీల పెంపు గురించి ప్రతిపాదనలు చేసింది. 
 
అయితే ప్రభుత్వం నుంచి ఛార్జీల పెంపు గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. లాక్ డౌన్ ముందు కూడా ఏపీఎస్ ఆర్టీసీ నష్టాల్లోనే ఉంది. ఛార్జీలు పెంచకపోతే ఆర్టీసీ నష్టాల బాట పట్టే అవకాశం ఉందని ఆర్టీసీ ప్రతిపాదనల్లో పేర్కొంది. బస్సు ఛార్జీలు పెంచడం ద్వారా అత్యవసరమైతే మాత్రమే ప్రయాణికులు ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: