ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు రెండు నెలల తర్వాత బస్సులు రోడ్డెక్కనున్నాయి. నిన్న బస్సులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన జగన్ సర్కార్ ఈరోజు రాత్రి నుంచి కొన్ని సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. మొదట నాలుగు రోజుల తర్వాత బస్సులు రోడ్డెక్కుతాయని వార్తలు వినిపించినా... ఇతర రాష్ట్రాలలో బస్సులు ఈరోజు ఉదయం నుంచే రోడ్డెక్కడంతో ఏపీ ప్రభుత్వం కూడా కొన్ని సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది. 
 
ఆర్టీసీ అధికారులు ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రణాళికాలు సిద్ధం చేశారు. మెయిన్ సిటీస్ మధ్య సర్వీసులను నడపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఆర్టీసీ నుంచి ఏయే నగరాల మధ్య బస్సులు నడపనుందో మరికొన్ని గంటల్లో అధికారిక సమాచారం వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల మధ్య బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైనట్లు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: