ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు ఇన్సెంటివ్ బకాయిలు రెండు విడతలో చెల్లిస్తామని సీఎం చెప్పారు. కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు జాగ్రత్తగా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని సూచించారు. కరోనా నివారణ చర్యలు, లాక్ డౌన్ అమలు గురించి ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలుస్తోంది. జగన్ ఒక క్యాలెండర్ ను తయారు చేసి ఆ క్యాలెండర్ ప్రకారం పథకాలను అమలు చేయనున్నారని సమాచారం. 
 
కరెంట్ ఫిక్సుడ్ ఛార్జీలను మూడు నెలలు రద్దు చేస్తూ జీవో ఇచ్చామని సీఎం కలెక్టర్లకు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల ప్రయోజనం చేకూరుతుందని చెప్పవచ్చు. మే 26న అర్చకులు, పాస్టర్లు, మౌజమ్ లకు 5,000 రూపాయల సాయం, 30వ తేదీన రైతు భరోసా కేంద్రాలు అందుబాటులోకి తీసుకురానున్నారు. రైతుభరోసా కేంద్రాల ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని చెప్పారు. జులై 8న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం ఉంటుందని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: