ఆంధ్రప్రదేశ్ లో స్కూల్స్ ని ఆగస్ట్ 3 నుంచి ఓపెన్ చెయ్యాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ ఆదేశాలు ఇచ్చారు. నాడు నేడు కి గానూ 456 కోట్లను విడుదల చేస్తూ ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా జులై చివరికి స్కూల్స్ లో అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చెయ్యాలని స్పష్టం చేసారు. 

 

అదే విధంగా... విద్యార్ధులకు 9 రకాల సదుపాయాలను కల్పించాలి అని జగన్ ఆదేశించారు. స్కూల్స్ పై ప్రతీ రోజు కలెక్టర్లు సమీక్షా సమావేశ౦ నిర్వహించాలి అని జగన్ స్పష్టం చేసారు. అలాగే పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుని విద్యార్ధులకు మెరుగైన విద్యను అందించే ప్రయత్నం చెయ్యాలని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: