ఆంధ్రప్రదేశ్ లో మద్యం అమ్మకాలపై ఆ రాష్ట్ర హైకోర్ట్ లో  విచారణ జరిగింది. ఏపీలో మద్యం అమ్మకాలకు సంబంధించి మొత్తం 3 పిటీషన్ లు దాఖలు అయ్యాయి. మద్యం అమ్మకాల దగ్గర భౌతిక దూరం పాటించడం లేదని పిటీషన్ దాఖలు అయింది. నిబంధనలను పాటించకపోతే కరోనా మరింత వ్యాపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. 

 

నిబంధనలను అనుసరించే ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలని హైకోర్ట్ లో పిటీషనర్ వాదించారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది హైకోర్ట్. తాము నిబంధనలకు అనుసరించే మద్యం అమ్మకాలను చేపట్టామని ఏపీ ప్రభుత్వ లాయర్ వాదించారు. కాగా ఏపీలో మద్యం అమ్మకాలు మొదలు కాగానే పెద్ద ఎత్తున జనాలు గుమి గూడటం వివాదాస్పదంగా మారింది. దీనిపై పలువురు ఆందోళన వ్యక్తం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: