దేశంలో ఇప్పుడు కరోనా కేసులు బాగా పెరిగిపోతున్నాయి.  ఇప్పటి వరకు లక్ష కేసులు నమోదు అయ్యాయి.  మొన్నటి వరకు కేసుల విషయంలో అంతగా భయం లేదన్న సర్కారు ఇప్పుడు పెరుగుతున్న కేసుల విషయంలో ఆందోళన మొదలైంది.  కేసులు మొదలవుతున్న సమయంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కేసులు పెరుగుతున్న సమయంలో లాక్ డౌన్ సడలింపు ఇవ్వడంతో కేసుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నారు.  కర్ణాటకలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కొత్తగా 127 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. సోమవారం సాయంత్ర 5 గంటల నుంచి మంగళవారం మధ్యాహ్నం 12 గంటల వరకు నమోదైన కరోనా కేసుల వివరాలను ‘మిడ్ డే’ బులెటిన్ పేరుతో కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసింది.  

కొత్త కేసులతో కలిపి కర్ణాటకలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 1373కు చేరింది. వారిలో 40 మంది కరోనావల్ల మరణించగా, మరో వ్యక్తి ఇతర కారణాలతో మృతిచెందాడు. మొత్తం 41 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. మరో 530 మంది వైరస్‌ బారి నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. మరణాలు, డిశ్చార్జిలు పోగా 802 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కర్ణాటకలో లాక్‌డౌన్ నిబంధనలను భారీగా సడలించడంతోనే కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: