దేశంలో గత కొన్ని రోజుల నుంచి లాక్ డౌన్ ప్రారంభం అయ్యింది.  ఫిబ్రవరి మాసంలో కరోనా కేసులు నమోదు కావడం.. అది కాస్త మార్చిలో పెరిగిపోవడంతో లాక్ డౌన్ విధిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.  లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి దేశంలో క్రైమ్ రేట్ తగ్గపోయిందని అంటున్నారు. కానీ దేశ వ్యాప్తంగా రెండు వేల రోడ్డు ప్రమాదాలు జరిగాయట.. ఇక అత్యాచారాలు, హత్యలు, లైంగిక వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది.  తాజాగా ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాది పార్టీ నాయకుడు, అతని కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. ఈ సంఘటన సంభాల్‌ జిల్లాలోని బహ్‌జోయ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

 

అయితే  అసలు గొడవ మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద జరుగుతున్న పనుల విషయంలో జరిగిందట. అదే కక్ష్య తో ప్రత్యర్థులు రగిలిపోతున్నారట. ఈ నేపత్యంలో అదును చూసి ప్రత్యర్థులు చోటేలాల్‌ను, అతని కుమారుడిని తుపాకీతో కాల్చిచంపారు.సంభాల్‌ జిల్లా సరోయ్‌ గ్రామానికి చెందిన చోటేలాల్‌ దివాకర్‌ 2017లో సమాజ్‌వాదీ పార్టీ తరఫున అసెంబ్లీకి పోటీచేసి ఓడిపోయాడు. ఆ తర్వాత సరోయ్‌ గ్రామ ప్రధాన్‌గా ఎన్నికయ్యాడు. అయితే ఇటీవల ఉపాధీ హామీ పథకం పనుల విషయమై చోటేలాల్‌కు, గ్రామ మాజీ ప్రధాన్‌కు మధ్య గొడవ జరిగింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: