అంఫాన్ తుఫాన్ ప్రభావం ఇప్పుడు పశ్చిమబెంగాల్ ని బాగా ఇబ్బంది పెడుతుంది. గంట గంటకు అక్కడ వర్షాలు పెరుగుతున్నాయి. కరోనా తోనే ఇబ్బంది పడుతున్న ఆ రాష్ట్రాన్ని ఇప్పుడు తుఫాన్ ప్రభావం బాగా ఇబ్బంది పెడుతుంది. అక్కడ భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపధ్యంలో కేంద్రం కూడా అలెర్ట్ ప్రకటించింది. 

 

అక్కడి సహాయక చర్యలను కేంద్ర హోం శాఖ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. తాజాగా బెంగాల్ సిఎం మమత కి కేంద్ర హోం శాఖా మంత్రి అమిత్ షా ఫోన్ చేసి సహాయక చర్యలపై ఆరా తీసారు. నేటి రాత్రి జాగ్రత్తగా ఉండాలని సిఎం కి ఆయన సూచించారు. అధికారులను అప్రమత్తం చేసుకోవాలని సిఎం కి సూచించారు షా. సిఎం వెంటనే అధికారులతో కూడా మాట్లాడి అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: