ఈ కరోనా ఏమో గాని ఎవరికి వారుగా భయపడిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో కూడా అర్ధం కావడం లేదు. తాజాగా ఒక సినీ ప్రముఖుడి ఇంట్లో కరోనా వైరస్ బయటపడింది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు బోనీ కపూర్ ఇంట్లో కరోనా వైరస్ బయటపడింది. 

 

ఆయన ఇంట్లో పని చేసే పని మనిషికి కరోనా ఉందని గుర్తించారు. అతని ఇంట్లో పని చేస్తున్న 23 ఏళ్ళ యువకుడికి కరోనా ఉందని పరీక్షల్లో వెల్లడైంది. చరణ్‌ సాహూ శనివారం అస్వస్థతకు గురవడంతో బోనీకపూర్‌ అదే రోజు పరిక్షలకు పంపించారు. ప్రస్తుతం అతనిని ఐసోలేషన్ లో ఉంచారు. దీనితో ఇప్పుడు బోనీ కపూర్ ఇంట్లో ఆందోళన వ్యక్తమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: