ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి రష్యాలో వేగంగా వ్యాప్తిచెందుతోంది.  చాలా  దేశాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నప్పటికీ రష్యాలో మాత్రం రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది.  కరోనా కేసులు మొదలైనప్పటి నుంచి అమెరికా, ఇటలీ, ఫ్రాన్స్, బ్రిటన్ ఇప్పుడు ఈ వరుసలో రష్య చేరింది.  చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా 213 దేశాలకు పాకినట్టు గుర్తించారు. ఇప్పటివరకు 47,17,038 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, 3,12,384 మంది మృత్యువాత పడ్డారు. ప్రపంచం మొత్తమ్మీద చికిత్స పొందుతున్న వారి సంఖ్య 25,94,555. ఇక, 18,10,099 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.

 

తాజాగా కరోనా ప్రభావం ఇప్పుడు రష్యాపై పడింది.  ఈ దేశంలో కరోనా విళయతాండవం చేస్తోంది. రష్యాలో పాజిటివ్‌ కేసుల సంఖ్య 3లక్షలకు చేరువలో ఉన్నది.  గడచిన 24 గంటల్లో రష్యాలో కొత్తగా  9,263 మందికి కరోనా సోకింది. దేశరాజధాని నగరం మాస్కోలోనే కొత్తగా 3,545 మందికి కోవిడ్‌-19 నిర్దారణ అయింది.  దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 299,941కు చేరింది. ఇప్పటి వరకు ఆ దేశంలో కరోనా నుంచి 76,130 మంది కోలుకున్నారు.  రష్యాలో రికార్డు స్థాయిలో 73లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఒక రోజు వ్యవధిలో మరో 115 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 2,837కు చేరింది

మరింత సమాచారం తెలుసుకోండి: